ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వాయుగుండంగా మారిన అల్పపీడనం

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. గురువారం సాయంత్రానికి ఇది విశాఖకు ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని కేంద్రం సూచించింది. వాయుగుండం ప్రభావం వల్ల ఒడిషా, ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, తెలంగాణ, రాయలసీమలో జల్లులు పడే అవకాశం ఉంది. విశాఖ, గంగవరం, కాకినాడ, కళింగపట్నం ఓడరేవుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను, ఇతర చోట్ల ఒకటో నెంబరు హెచ్చరికను ఎగరవేశారు. వాతావరణానికి అమావాస్య ప్రభావం కూడా తోడవడంతో విశాఖలో సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. వాసవానిపాలెం, జాలారి ఎండాడ, శివగణేశ్‌నగర్‌లో మత్స్యకారుల ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చిచేరింది. దీంతో ఆ ఇళ్లలో ఉంటున్నవారు కలవరపడ్డారు. కాసేపటికి నీరు వెనక్కి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలల తాకిడికి తీరంలో ఉన్న కొన్ని పడవలు ఒడ్డున ఉన్న మత్స్యకారుల ఇళ్ల వద్దకు కొట్టుకువచ్చాయి.

కామెంట్‌లు