ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

విద్యాలయాల్లో సౌకర్యాలు కల్పించాలి

విద్యాలయాల్లో సౌకర్యాలు కల్పించాలి

ఈ విద్యా సంవత్సరం దాదాపు ముగిసింది. విద్యాలయాలకు సెలవులు కూడా ప్రకటిస్తున్నారు. ఈ సెలవుల్లో విద్యాలయాల్లో ఆదనపు వసతులు కల్పనకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రయివేటు విద్యాలయాలకు దీటుగా సర్కారు విద్యాలయాల్లో సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా విద్యను సజావుగా అభ్యసించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. నేటికీ పక్కా భవనాలు లేని విద్యాలయాలు చాలా ఉన్నాయి. పక్కా భవనాలు లేని చోట భవనాలను నిర్మించాల్సి ఉంది. మరుగుదొడ్లు లేని చోట మరుగుదొడ్లును నిర్మించాలి. తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు పక్కాగా చర్యలు చేపట్టాలి. ఉన్న వసతులకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. చాలా ప్రాధిమిక పాఠశాలలకు విద్యుత్‌ కనక్షన్‌లు లేవు. ఈ పాఠశాలలలో టి.వి.లు ఉన్నా, వాటిని బోధనకు ఉపయోగించటం లేదు. విద్యుత్‌ కనక్షన్‌ ఉంటే వీటిని విద్యా బోధనకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠశాలలకు విద్యుత్‌ కనక్షన్లు ఏర్పాటుకు కూడా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాల్సి ఉంది. రానున్న విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలి. నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పనకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. దీనికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన సూచనలు, సలహాలు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అందజేయాలి. స్థానిక సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లి వాటి పరిష్కారానికి కృషి చెయ్యాలి. ఇది అంతా తమ బాధ్యతగా భావించాలి.

కామెంట్‌లు