ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మల్లెలు చేసే మేలు...

 మహిళావారధి: మహిళలు ఎటువంటి శుభకార్యాలు జరిగినా మొట్టమొదట ప్రాథాన్యతనిచ్చేది పూలకే. ఆ పూలల్లో ఎక్కువుగా చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకూ ఇష్టపడేది మల్లెపువ్వులనే. మల్లెల్లో ఉన్న సువాసన, గుబాళింపు ఆ మత్తే వేరు.  స్త్రీలు సౌందర్య సాధనంగా ఉపయోగించే మల్లెపూలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం...
రోజంతా అలసిపోయిన కనులపై మల్లెలను కొద్దిసేపు ఉంచినట్లయితే చలవనిస్తాయి. తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిన్ని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాక జుట్టు కూడా పట్టు కుచ్చులా మెరిసిపోతుంది. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమే కాక మాడుకు చల్లదనాన్నిస్తుంది. మల్లె పువ్వులను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి. మల్లెపూల రసం తీసి గులాబీ పువ్వుల రసం, గుడ్డులోని పచ్చ సొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతుంది. మల్లెపూలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పలు ఔషధాలలో మల్లెపూలను వాడుతున్నారు.

కామెంట్‌లు