Loading...

18, ఫిబ్రవరి 2023, శనివారం

ఆర్టీసీ బస్టాండ్ లో నిర్మించే కట్టడం ఎవరిది నిగ్గు తేల్చండి


-మున్సిపల్ కమిషన్ కోరిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు

జగ్గయ్యపేట, చైతన్య వారిధి: పట్టణంలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని వాటిని నియంత్రించాలని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శివ కోటేశ్వరావు కలిసి వినతి పత్రం అందజేశారు.   అక్రమ నిర్మాణాలు చేసేదే ఎవరు? వాటికి అడ్డుకట్ట వేయాల్సింది ఎవరు అంటూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు‌ కమిషనర్ ను నిల దీశారు.జగ్గయ్యపేట ఆర్టీసీ అవరణలో ఇన్ ఔట్  గేట్ వద్ద గత మూడు రోజులుగా జరుగుతున్న అక్రమ నిర్మాణ పనులు గురించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ సందర్భంలో కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి స్థలాన్ని ఎవరికి కేటాయించారు, ఎంత కేటాయించారు, ఏ పనుల కోసం కేటాయించడం జరిగినది, పనులు ఎవరు చేయిస్తున్నారు, ఏ ప్రాతిపదికన స్థలం కేటాయించడం జరిగినది, అనుమతులు ఏవిధంగా ఇచ్చినారు, జరుగుతున్న పనులు ఎంత ఖర్చు చేసి చేస్తున్నారు ఆ మొత్తం ఖర్చు ఏ డిపార్ట్మెంట్ నుండి మంజూరు చేయడం జరిగినది,స్థలాన్ని ఉచితముగా ఏమైనా కేటాయించారా? అని తదితర అంశాలు మున్సిపల్ కమిషనర్ వారిని కోరగా వారి వద్ద సరైన సమాధానం చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిఎం ని అడగగా వారు  మున్సిపల్ వారికి ఇవ్వడం జరిగిందని చెబుతున్నారని, ఈ విధంగా ప్రభుత్వ స్థలాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఏ శాఖ అయినా  ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.  త్వరితగతిన అధికారులు స్పందించి ఆ కట్టుబడి కి సంబంధించిన పూర్తి వివరాలు తెలపి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మేక వెంకటేశ్వర్లు, మైనేని రాధాకృష్ణ, కౌన్సిలర్లు , పేరం సైదేశ్వరరావు,  నకిరికంటి వెంకటి,  గొట్టే నాగరాజు మరియు నాయకులు సూర్యదేవర రాంప్రసాద్, గెల్లా. వైకుంఠేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

12, జనవరి 2022, బుధవారం

పొత్తులపై ఒకే మాట మాట్లాడుదాం


- ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం - జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని, పొత్తులపై ఒకే మాట మాట్లాడుదామని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడదామని పార్టీ శ్రేణులకు పవన్‌ సూచించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోబోనని.., ప్రతి జనసైనికుడి ఆలోచనతోనే పొత్తులపై నిర్ణయం ఉంటుందని అన్నారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్.. ఇప్పటికే భాజపాతో జనసేన పొత్తులో ఉందన్నారు. పలు పార్టీలు జనసేనతో పొత్తు కోరుకోవచ్చునని.., అదంతా మైండ్ గేమ్ అనుకోవచ్చునని పవన్ అన్నారు. జనసేన క్షేత్రస్థాయిలో పుంజుకుంటోందని.. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిపెట్టాలని శ్రేణులకు సూచించారు. ఇదిలావుంటే, ఇటీవ‌ల చిత్తూరులోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ప‌ర్య‌ట‌న‌లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లుచేశారు. జనసేనతో పొత్తుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘పొత్తులు పెట్టుకున్నప్పుడే టీడీపీ గెలిచిందని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినప్పుడు గెలిచాం, ఓడిపోయాం కూడా. రాష్ట్ర ప్రయోజనాల మేరకు పరిస్థితులకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మ‌రోసారి జ‌న‌సేన‌తో పొత్తుకు సిద్ధ‌మ‌య్యార‌నే చ‌ర్చ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ ఈ క్ర‌మంలోనే చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. మ‌రి మున్మందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

11, జనవరి 2022, మంగళవారం

కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.58.56 లక్షలు

విశాఖపట్నం: పాతనగరం బురుజుపేటలో వెలిసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి హుండీల ద్వారా రూ.58,56,405 ఆదాయం లభించింది. గత నెల 20 నుంచి ఈనెల 10 వరకు వచ్చిన ఆదాయాన్ని సోమవారం ఆలయ ఆవరణలో లెక్కించారు. బంగారం 142.127 గ్రాములు, వెండి 1.700 కిలోగ్రాములు, అమెరికా డాలర్లు 32, యుఏఈ సెంట్రల్‌ బ్యాంకు దిర్హామ్స్‌ 15 లభించాయి. ఆలయ ఈఓ ఎస్‌జె మాధవి, ఏఈఓలు వి.రాంబాబు, పి. రామారావు, పర్యవేక్షకులు అప్పలనర్సింహరాజు, త్రిమూర్తులు,  ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయ ఈఓ జగన్నాథరావు, తనిఖీ అధికారి నర్సింగరావు, ధర్మకర్తలి మండలి ఛైర్‌పర్సన్‌ కొల్లి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.

1, జులై 2020, బుధవారం

ఘనంగా విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు

గాజువాక, చైతన్యవారధి:
జీవీఎంసీ 65 వ వార్డు పరిధిలో గల కాకతీయ జంక్షన్ వధ్ద గల స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద  జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు,  వెంబో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు  మంత్రి మంజుల నేతృత్వంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ విజయ సాయి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు 74 వ వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల వంశీ రెడ్డి, 76 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి దొడ్డి రమణ, 66 వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ హాజరయ్యారు. వార్డు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి విజయసాయి రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

9, నవంబర్ 2018, శుక్రవారం

అనుమతులు రద్దు చేయండి



- ప్రత్యేక అధికారిని కోరిన భరణికం గ్రామస్తులు
పరవాడ, చైతన్యవారధి: మండలంలో భరణికం పంచాయితీ పరిధిలో నిర్మిస్తున్న అమ్మోనియా గ్యాస్ కంపెనీ కి అనుమతులు రద్దు చేయమని ప్రత్యేక అధికారికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.  గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో అమ్మోనియా గ్యాస్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అమ్మోనియం గ్యాస్ కంపెనీ నుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది.

27, జులై 2018, శుక్రవారం

ప‌వ‌న్ కు ఎవ‌రినీ మోస‌గించ‌టం చేత‌కాదు


- జగన్ వ్యాఖ్యలపై నాగబాబు రియాక్షన్
ప‌వ‌న్ కు ఎవ‌రినీ మోస‌గించ‌టం చేత‌కాద‌ని  ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు అన్నారు. పవన్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైవాహిక జీవితంలోనూ ప‌వ‌న్ ఎవ‌రికీ అన్యాయం చేయ‌లేద‌న్నారు. ఇద్ద‌రు భార్య‌ల నుంచి విడాకులు తీసుకోవ‌టానికి కార‌ణాలు ఏమిట‌న్న‌ది భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన విష‌య‌మ‌ని.. ప‌వ‌న్ చ‌ట్ట‌బ‌ద్ధంగానే విడాకులు తీసుకున్నార‌ని.. అందులో ఎలాంటి వివాదం లేద‌న్నారు. ప‌వ‌న్ మొద‌టి భార్య కానీ.. రెండో భార్య రేణూ కానీ ఎక్క‌డా ప‌వ‌న్ గురించి త‌ప్పుగా మాట్లాడిన సంద‌ర్భాలు లేవ‌ని నాగ‌బాబు చెప్పారు.

17, ఏప్రిల్ 2018, మంగళవారం

వైభవంగా జిల్లా ప్రజా పరిషత్‌ శతవసంతాల వేడుకలు

కాకినాడ, ఏప్రిల్ 17(చైతన్యవారధి):
తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ శతవసంతాల వేడుకలు వైభవంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,హోంశాఖా మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.  జిల్లా ప్రజా పరిషత్‌ శత వసంతాల వేడుకల సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద జిల్లా పరిషత్‌ శత జయంతి వేడుకల జెండాను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్‌ అధ్యక్షులు జ్యోతుల నవీన్‌ కుమార్‌ , జిల్లా కలక్టర్‌ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు.

నిజరూప దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

- సామాన్య భక్తులకు సకల సౌకర్యాలు
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, ఏప్రిల్‌ 17(చైతన్యవారధి): స్వామి నిజరూప దర్శనం కోసం  ఎదురు చూస్తున్న భక్తులందరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించడం  జరిగిందని రాష్ట్ర మానవవనరుల శాఖా మాత్యులు గంటా శ్రీనివాసరావు వివరించారు.  మంగళవారం మంత్రి దేవస్థానం  ఎగ్జిక్యూటివ్‌  ఆఫీసరు రామచంద్ర మోహన్‌ తో కలిసి గుడి ప్రాంగణం అంతా తిరిగి పరిశీలించి ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం  చేశారు. 

మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇవిఎమ్ ల పరిశీలన

- ఆర్.డి.వో ఎల్.రఘుబాబు వెల్లడి
కాకినాడ, ఎప్రిల్ 17(చైతన్యవారధి):
రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఉత్తర్వులు ప్రకారముప్రకారము తూర్పుగోదావరి జిల్లా కలక్టరు వారి కార్యాలయము ప్రక్కన గల ఎన్నికల గోదామునందు భద్రపరచిన ఇవిఎమ్ లను నూరు శాతము  మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలన చేయుటకు ఈ  రోజు ఉదయము కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు అద్వర్యములో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షములో ఎన్నికల గోదామును తెరిచి ఇవిఎమ్ లను నూరు శాతము  మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలన చేయు కార్యక్రమము ప్రారంభించడమైనది. ఈ యొక్క పరిశీలన కార్యక్రమము ఈ రోజు నుండి ఈ నెల 25 వ తేదీ వరకు జరుగు ఇవిఎమ్ లు పరిశీలన జరుగునని ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తెలిపియున్నారు. అదే విధముగా ప్రస్తుత ఎన్నికల గోదామునందు మొదటి అంతస్తు  నిర్మాణములో ఉన్న అదనపు గోదాము నిర్మాణము పనులు పరిశీలించి గోదాము నిర్మాణ పనులు వేగవంతము చేయాలని సదరు గోదాము నిర్మాణ గుత్తేదారును ఆదేశించియున్నారు. ఈ యొక్క పరిశీలన కార్యక్రమములో కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తో పాటు భారత జనతా పార్టీ జిల్లా పార్టీ అద్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సి.పి.ఐ. పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్.కిషోర్,  కాకినాడ అర్బన్ తహశీల్దార్ జి.బాలసుబ్రహ్మణ్యం, తహశీల్దార్ కె.ఆర్.సి ఎం.విద్యాసాగర్, ఎన్నికల డిప్యూటి తహశీల్దార్ జె.వి.ఆర్.రమేష్, కె.యస్.వి.సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ సహయ ఇంజీనీరు సుబ్బరాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.